Gosala Prasad Death

Gosala Prasad Death: ప్రఖ్యాత జర్నలిస్ట్.. ఎనలిస్ట్ గోశాల ప్రసాద్ ఇక లేరు.. 

Gosala Prasad Death: సీనియర్ జర్నలిస్ట్.. దశాబ్దాలుగా తేలుతూ రాష్ట్రాల ప్రజలకు తన విశ్లేషణలతో దగ్గరైన గోశాల ప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 64 ఏళ్లు. హైదరాబాద్ లోని తన ఇంటిలో సోమవారం రాత్రి ఆయన మరణించారు. 

Gosala Prasad Death: గోశాల ప్రసాద్ గా తెలుగు ప్రజలకు సుపరిచుతులైన గోశాల వెంకట సోమేశ్వర దైవ ప్రసాద్ మహా న్యూస్ డిబేట్స్ లో విశ్లేషకులుగా అందరికీ ఎంతో దగ్గరయ్యారు. రాజీకీయ, సామాజిక అంశాల విశ్లేషణలో మహాన్యూస్ డిబేట్స్ లో గోశాల ప్రసాద్ నిజాలను నిస్సంకోచంగా వెల్లడించడంలో ముందుండే వారు. సమస్యలపై విశ్లేషణలతో పాటు మహాన్యూస్ ప్రేక్షకుల కోసం స్పష్టతతో కూడిన సమాచారాన్ని అందించడంతో మహాన్యూస్ ప్రేక్షకులకు గోశాల ప్రసాద్ మరింత దగ్గరయ్యారు. 

Gosala Prasad Death: నాలుగు దశాబ్దాల పైగా జర్నలిస్టుగా సేవలు అందించిన గోశాల ప్రసాద్ స్వస్థలం కాకినాడ. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. జర్నలిస్టుగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు ఆంధ్రప్రభలో వివిధ హోదాల్లో పలు జిల్లాల్లో సేవలు అందించారు. 

Gosala Prasad Death: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికార పత్రిక ఆంధ్రప్రదేశ్ పత్రికలో అసోసియేట్ ఎడిటర్ గా పనిచేశారు. కొంత కాలం సొంత పత్రిక మిర్రర్ టుడే నిర్వహించారు. 2010-14 లో మంత్రి ఆనం దగ్గర, 2014-16 సంవత్సరాల లో వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావు వద్ద కొంత కాలం పిఆర్ ఓ గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆరాధన పత్రిక కు ఎడిటర్ గా ఉన్నారు.

తన మృదువైన శైలితో అనేక మంది సీనియర్ రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు సుపరిచతులై, వారి తలలో నాలుకగా గోశాల ప్రసాద్ ఉండేవారు.

Gosala Prasad Death: మహాన్యూస్ ద్వారా ఎనలిస్ట్ గా పరిచయమైన ఆయన వివిధ ఛానల్స్ లో చర్చా కార్యక్రమాల్లో పాల్గొని తనదైన ప్రత్యేకతతో ప్రజలందరి మనస్సులలోనూ గోశాల ప్రసాద్ గా నిలిచిపోయారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం:

సీనియర్ జర్నలిస్ట్ గోశాల ప్రసాద్ ఆకస్మిక మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సంతాపాన్ని తెలియచేశారు. జర్నలిస్టుగా గోశాల ప్రసాద్ అందించిన సేవలు మరువలేనివని చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Komatireddy Venkatreddy : రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత హరీష్ రావుకి లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *