Fear: ప్రముఖ నటి వేదిక ప్రధాన పాత్రను పోషించిన ‘ఫియర్’ సినిమా ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఈ సస్పెన్స్ థిల్లర్ మూవీతో డాక్టర్ హరిత గోగినేని దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. దీనిని ఎ.ఆర్. అభి నిర్మించారు. అరవింద్ కృష్ణ ప్రత్యేక ప్రాతను పోషించిన ఈ సినిమా అంతర్జాతీయ చిత్రోత్సవాలలో దాదాపు 70 అవార్డులను అందుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ నటుడు మాధవన్ విడుదల చేశారు. చిన్నప్పటి నుండి మానసిక సమస్యలతో బాధపడే సింధు వైద్యం నిమిత్తం హాస్పిటల్ లో చేరుతుంది. ఆమెను వెంటాడే వ్యక్తి ఎవరు? ఎందుకు ఆమెను భయపెడుతున్నాడు అనే అంశాన్ని దర్శకురాలు ఆసక్తికరంగా తెరకెక్కించినట్టు ఈ ట్రైలర్ బట్టి అర్థమౌతోంది. దీని చివరిలో నాయికను ద్విపాత్రాభియంలో చూపించడం థ్రిల్ కు గురిచేసేలా ఉంది. ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు కలిగిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.