Ranbir Kapoor: రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చిన ‘యానిమల్’ సినిమా ఘన విజయాన్ని సాధించింది. దాంతో దానికి సీక్వెల్ గా ‘యానిమల్ పార్క్’ చేస్తామని మేకర్స్ తెలిపారు. తాజాగా ఆ చిత్ర కథానాయకుడు రణబీర్ కపూర్ ‘యానిమల్’ మూడో భాగం కూడా ఉండబోతోందని చెప్పాడు. ప్రస్తుతం ‘యానిమల్ -2’ స్క్రిప్ట్ దశలో ఉందని, ఇది 2027లో సెట్స్ పైకి వెళుతుందని అన్నాడు. అయితే… దీనికి మూడో భాగం కూడా ఉంటుందని రణబీర్ చెబుతున్నాడు. ‘యానిమల్’ స్క్రిప్ట్ దశలోనే తనతో సందీప్ రెడ్డి ఓపెన్ గా డిస్కస్ చేసేవాడని, అలానే రెండో భాగం స్క్రిప్ట్ గురించి కూడా తనతో ఎప్పటి కప్పుడు చర్చిస్తున్నాడని అన్నాడు. ఈ రెండో భాగంలో తాను హీరోగా, విలన్ గా నటించబోవడం ఆసక్తిని కలగచేస్తోందని… సందీప్ రెడ్డి సూచనల మేరకే తాను మొదటి భాగంలో యాక్ట్ చేశానని రణబీర్ తెలిపాడు.