Visakhapatnam: ఇటీవల కాలంలో లోన్ యాప్‌ల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. అవసరాల కోసం ఆన్‌లైన్ యాప్‌లను ఆశ్రయించిన ఘటనలు కొన్ని అయితే… వారే పిలిచి మరి లోన్‌లు ఇచ్చి.. తర్వాత వేధింపులకు గురిచేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. లోన్ ఇవ్వడం….ఆ తర్వాత రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో.. ఇప్పటికే ఎంతో మంది ప్రాణలు తీసుకున్నారు. తాజాగా లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలి అయ్యాడు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది.
లోన్ యాప్ వేధింపులు భరించలేక పెళ్లయిన 40 రోజులకే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రూ.2 వేల కోసం యువకుడి ఫోటోలను మార్ఫింగ్‌లు చేసి బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఆ మార్ఫింగ్ పోటోలను స్నేహితులకు, బంధువులకు లోన్ యాప్ నిర్వహకులు పంపారు.
Visakhapatnam: ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు..మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. లోన్ యాప్స్.. సైబర్ నేరాల నుంచి జాగ్రత్త వహించాలని…అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.