Drinker Sai: ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటించిన సినిమా ‘డ్రింకర్ సాయి’. కిరణ్ తిరుమలశెట్టి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ బసవరాజు శ్రీనివాస్, లహరిధర్, ఇమాయిల్ షేక్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఈ నెల 27న మూవీ రిలీజ్ కాబోతున్న సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా గురించి హీరో ప్రభాస్ ను కలిసి చెప్పానని, ఆయన తనకు, తన టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారని హీరో ధర్మ అన్నారు.
ఇది కూడా చదవండి: Life Style: ప్రశాంతమైన జీవనానికి ఇవి పాటించాలి
Drinker Sai: ఈ సినిమా ఫస్ట్ హాప్ ఎంటర్ టైన్ నింగ్ ఉంటుందని, క్లయిమాక్స్ హార్ట్ టచ్చింగ్ గా ఉంటుందని దర్శకుడు కిశోర్ తెలిపారు. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కావడం ఆనందంగా ఉందని ఐశ్వర్య శర్మ తెలిపింది. ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే ధీమాను సంగీత దర్శకుడు శ్రీవసంత్ వ్యక్తం చేశారు.