Allu Arjun: ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప2 గురించి చర్చే నడుస్తోంది. రికార్డు కలెక్షన్లు ఒకవైపు.. అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యు ఒకవైపు పుష్పను ట్రెండింగ్ లో ఉంచుతున్నాయి. పాన్ వరల్డ్ సినిమాగా పుష్ప2 తిరుగులేని కలెక్షన్లను సాధిస్తోంది. మరోవైపు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణం.. గాయాల పాలైన బాలుడి పరిస్థితి చుట్టూ సినిమా రాజాకీయాలు నడుస్తూ వస్తున్నాయి. డిసెంబర్ 24న అల్లు అర్జున్ ను పోలీసులు విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. ఆరోజు దాదాపు మూడున్నర గంటలపాటు ఆయనను పోలీసులు విచారించారు. ఈ విచారణ తరువాత సమస్య కాస్త చల్లారినట్టే కనిపిస్తోంది.
Allu Arjun: ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ ను పోలీసులు విచారణ జరిపిన రోజు సాయంత్రం నుంచి ఒక పాట ట్రెండింగ్ గా మారింది. పుష్ప 2 సినిమాలోని “దమ్ముంటే పట్టుకోరా షెకావత్” పాటను అదేరోజు టీ సిరీస్ యుట్యూబ్ లో పోస్ట్ చేసింది. దీని తరువాత ఆ పాట విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఈ పాటను తీసుకుని ట్రోలింగ్స్ కూడా మొదలు పెట్టారు కొందరు. అయితే, ఈ పాటను పోలీసులను ఉద్దేశించే యూట్యూబ్ లో వదిలారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో యూట్యూబ్ నుంచి ఆ పాటను డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీ సిరీస్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఈ పాట కనిపించడం లేదు.
Allu Arjun: ఈ పాట విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ తరువాత దీనిని డిలీట్ చేశారా? లేకపోతే ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? అనే విషయం తెలియాల్సి ఉంది.