Laila: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘లైలా’ ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున విడుదల కాబోతోంది. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘ఇచ్చుకుందాం బేబీ’ని మూవీ టీమ్ గురువారం లాంచ్ చేసింది. ‘లైలా’ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, తాజా గీతానికి పూర్ణాచారి సాహిత్యం అందించారు. ఆదిత్య ఆర్కే, ఎం.ఎం. మానసి పాడారు. బీచ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పాటలో ఆకాంక్ష శర్మ తన ఛార్మ్ తో అదనపు గ్లామర్ అద్దింది. దీని తర్వాత ఫిబ్రవరి 1న వచ్చే రాయలసీమ మాస్ సాంగ్ ‘ఓహో రత్తమ్మ’ కూడా అదిరిపోతుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లోనూ కనిపిస్తాడు. దాని మేకప్ కోసం దాదాపు రెండు గంటల సమయం పట్టేదని, సినిమా అంటే పిచ్చి ఉంటే తప్పితే ఇలాంటి పని చేయలేరని, అలాంటి పిచ్చి విశ్వక్ సేన్ కు ఉంది కాబట్టే ఇది సాధ్యమైందని దర్శకుడు రామ్ నారాయణ్ అన్నారు. వాలెంటైన్ డే న తోడు లేదని సింగిల్ గా ఉండే కుర్రాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదని, వారికి తోడుగా ఉండటానికి ‘లైలా’ వస్తోందని విశ్వక్ సేన్ చెప్పారు. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా అని నిర్మాత సాహు గారపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత పూర్ణచారి కూడా పాల్గొన్నారు.