Chandra Babu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ భేటీలో భాగంగా తొలుత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ట్రంలోని వివిధ పెండింగ్ అంశాలపై చర్చించారు. ఆయా ప్రాజెక్టులకు వెంటనే ఆర్థికసాయాన్ని విడుదల చేయాలని ఆమెకు చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.
Chandra Babu Naidu: అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అదే విధంగా కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్, కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషితో సమావేశం అవుతారు. అనంతరం ఇదేరోజు సాయంత్రం చంద్రబాబు విజయవాడకు బయలుదేరి రానున్నారు.
Chandra Babu Naidu: దావోస్‌లో నాలుగు రోజులపాటు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సద్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా నిన్న అర్ధరాత్రి దాటాక ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం వరుస భేటీలతో ఆయన బిజీగా గడుపుతున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రానున్న నేపథ్యంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్, ఇతర మంత్రులతో భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.