Laapataa Ladies

Laapataa Ladies: ‘లాపతా ‘ కాదు… ‘లాస్ట్ లేడీస్’!

Laapataa Ladies: కిరణ్ రావ్ దర్శకత్వంలో ఆమె మాజీ భర్త ఆమీర్ ఖాన్ నిర్మించిన ‘లా పతా లేడీస్’ చిత్రానికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. థియేటర్లలో కంటే ఓటీటీలో ఈ సినిమాకు చక్కని ఆదరణ లభించింది. ఇటీవల ‘లా పతా లేడీస్’ మూవీని భారతదేశం నుండి ఆస్కార్ నామినేషన్స్ కు అధికారికంగా ఎంపిక చేశారు. ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలోనూ చక్కని గుర్తింపు దక్కాలనే ఉద్దేశ్యంతో మూవీ పేరును ‘లా పతా లేడీస్’ అని కాకుండా ‘లాస్ట్ లేడీస్’ అని మార్చరు. ఇక మీదట దీనిని ఆ పేరుతోనే ప్రచారం చేయబోతున్నారు. అవార్డుకు అర్హత సంపాదించుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు అన్నీ చేస్తామని, అందులో భాగంగానే పేరూను మార్చామని ఆమీర్ ఖాన్ చెబుతున్నారు. ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే యేడాది మార్చి 3న జరుగబోతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  ka movie: ‘క’, ‘హనుమాన్’కి సింపతి వర్కౌట్ అయిందా!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *