Kubera Movie: కోలీవుడ్ స్టార్ ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “కుబేర” సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ సొంతం చేసుకున్న ఈ మూవీ కోసం తమిళ, తెలుగు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌గా మ్యూజిక్ మాస్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ ట్రీట్ ఇవ్వనున్నారు. తాజాగా మొదటి సింగిల్ రిలీజ్ అప్డేట్‌తో మేకర్స్ సందడి చేశారు. ఏప్రిల్ 20న ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా ధనుష్ స్టైలిష్ లుక్‌తో కూడిన సెలబ్రేటరీ పోస్టర్ రిలీజ్ చేసి అభిమానుల్లో జోష్ నింపారు. శేఖర్ కమ్ముల స్టైలిష్ టేకింగ్, ధనుష్ డైనమిక్ నటన, దేవిశ్రీ సంగీతం కలయిక అదిరిపోనుందని అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కింగ్ నాగార్జున కీలక పాత్రలో మెరవనగా, ఆసియన్ సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జూన్ 20న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న “కుబేర” బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!
