ED Raids

ED Raids: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

ED Raids: హైదరాబాద్‌లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కలకలం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున నగరంలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఈడీ అధికారులు సుడిగాలి తనిఖీలు ప్రారంభించారు. ఈ సోదాలు ప్రముఖ పారిశ్రామికవేత్తలైన సురానా గ్రూప్ చైర్మన్ నరేందర్ సురానా, మేనేజింగ్ డైరెక్టర్ దేవేందర్ సురానా ఇళ్లలో మరియు వారి ఆఫీసుల్లో కొనసాగుతున్నాయి.

సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్‌ వంటి ప్రాంతాల్లో సమకాలీనంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయని సమాచారం. మనీలాండరింగ్ మరియు విదేశాలకు అక్రమంగా డబ్బులు తరలించిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ చర్యలకు దిగినట్లు తెలిసింది.

ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావో అగ్ర నేతలు హతం

ఇప్పటి వరకు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ, ఈ సోదాలు మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో వ్యాపార ప్రపంచంలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఈ దాడులు చర్చనీయాంశంగా మారాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Egg vs Panner: గుడ్లు, పన్నీర్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *