KTR: భారతీయ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లగచర్ల రైతులను కలిసేందుకు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. పరిగి సబ్ జైలు నుంచి గురువారమే లగచర్ల రైతులను సంగారెడ్డి జైలుకు తరలించారు. ఈ మేరకు ఆ రైతులను కలిసేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల బృందంతో కలిసి వెళ్లనున్నట్టు ఆయన ప్రకటించారు. రైతులను అక్రమంగా నిర్బంధించారని, వారిని పరామర్శించి, వారిలో మనోధైర్యం నింపుతామని కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్ నందినగర్ నివాసం నుంచి సంగారెడ్డికి బయలుదేరి వెళ్లారు.