Kavuri Lavanya: అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవికి రాజీనామా చేయాలని ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కావూరి లావణ్య డిమాండ్ చేశారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించి తమ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలి అని పంపిస్తే అసెంబ్లీకి వెళ్లకుండా తప్పించుకోవటం సిగ్గు చేటు అని అన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై తప్పుడు పోస్టింగ్ లు పెట్టే వారిపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం మంచి పరిణామం అని, ఒక మహిళా నాయకురాలిగా ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తామనీ, అదే విధంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని త్వరితగతిన అమలు చేయాలంటున్న ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కావూరి లావణ్య.