KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కొన్నది కాకరకాయ.. కొసిరింది గుమ్మడికాయ అన్నట్లు ఉంది తెలంగాణ ప్రభుత్వం తీరు అన్ని అన్నారు. తెలంగాణాలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం కొన్నది 46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. రైతుభరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15 వేల కోట్లకు గాను గత వానాకాలం, యాసంగి కలిపి ఎగ్గొట్టింది 26 వేల కోట్లు అనే అన్నారు. క్వింటాలుకు రూ.500 బోనస్ అని రైతులలో ఆశలు రేపి దొడ్డు వడ్లకు తెడ్డు చూపి, సన్న వడ్లకు సవాలక్ష కొర్రీలు పెట్టి విదిలించింది కేవలం రూ.530 కోట్లు.. అసలు రైతుకే భరోసా లేదు ఇక కౌలు రైతులు, రైతుకూలీల ఊసెక్కడిది అని అడిగారు. కల్లాల వద్దకే కొనుగోళ్లతో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతుకు భరోసా ఇచ్చారు. కల్లోల కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లు లేక రైతన్నల ఆందోళన చెందుతున్నారు అని అన్నారు.