KTR: కనకపు సింహాసనమున శునకము అంటూ కేటీఆర్ సంచలనం..

KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయ మాట్లాడుతూ, రేవంత్‌పై విమర్శలు గుప్పించారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ, “కనపుపు సింహాసనంపై శునకాన్ని కూర్చుండబెట్టినా, దానికి ఆ బుద్ధి రాదు. రేవంత్‌రెడ్డికి పైశాచిక ఆనందం ఉంది. నేను జైలుకు వెళ్లినందుకే అందరినీ జైలుకు పంపించాలనే భావన ఉంది. కానీ, నేను విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకువస్తాను. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాను. ఈ తేడా మీకు, మాకు ఉంది” అని వ్యాఖ్యానించారు.

“మేం మన నాయకుడు కేసీఆర్‌ చెప్పినట్లుగా ప్రపంచపటంలో తెలంగాణను ఉంచాలనే లక్ష్యంతో ఉన్నాం. రేవంత్‌ రెడ్డిలా రూ.50 లక్షల కేసులో దొరికిన దొంగలం కాదు. మేం లుచ్చా పనులు చేయం. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలెవరూ రేవంత్‌ రెడ్డికి భయపడే స్థితిలో లేరు. తెలంగాణలో ఎవ్వరూ ఆయనను ముఖ్యమంత్రి అని అంగీకరించరు” అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

లొట్టపీసు కేసు మాత్రమే

“రేవంత్‌ రెడ్డి ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎన్ని సవాళ్లు విసిరినా మేము భయపడమని స్పష్టం చేస్తాం. ఇది లొట్టపీసు కేసు మాత్రమే. దీనిలో నెయ్యి బీరకాయలో ఎంత నెయ్యి ఉంటుందో, మైసూర్‌ బోండాలో ఎంత మైసూర్‌ ఉంటుందో అంత మాత్రమే ఉంది. అక్రమ కేసులు పెట్టి నాలుగు రోజులు జైలులో పెట్టాలనే మీకు ఆనందం ఉంటుంది. కానీ, మేము న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నాం” అని కేటీఆర్‌ చెప్పారు.

విచారణకు వెళ్లేందుకు సిద్ధం

“ఏసీబీ అధికారులు పిలిస్తే నేను విచారణకు వెళ్లేందుకు సిద్ధం. ఏసీబీ అధికారులను అడిగినా ప్రశ్నలు లేవు. రేవంత్‌ రెడ్డి పంపిస్తే తప్ప అవి వస్తాయని చెబుతున్నారు. నేను ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిగా మా హైదరాబాదు బ్రాండ్‌ ఇమేజ్‌ పెంపొందించడానికే పని చేస్తున్నాను. ఒక పైసా అవినీతి కూడా నేను చేయలేదు. మీరు మీ కేసులో రుజువు చేయలేకపోతున్నారు” అని కేటీఆర్‌ చెప్పారు.

ప్రజల సమస్యలపై దృష్టి పెట్టండి

కేటీఆర్‌ చివరిగా బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలకు పిలుపునిస్తూ, “రేపటి నుంచి మీ ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి. పార్టీని ముందుకు తీసుకెళ్లండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనక్కి తగ్గేది లేదు” అని సూచించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AP Drone Policy: ₹1000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ‘ఏపీ డ్రోన్‌ పాలసీ’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *