KTR: కాంగ్రెస్ ప్రభుత్వం పై రాహుల్ గాంధీ స్పందించాలి..

KTR: మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) కాంగ్రెస్‌ ప్రభుత్వాంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రతి ఎకరానికి రూ.15,000 అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక ఆ మొత్తాన్ని రూ.12,000కే పరిమితం చేయడం మోసం అని కేటీఆర్‌ పేర్కొన్నారు. రైతుల ధన్యవాదాలు పొందడానికి ఇలాంటి కరపత్రిక చర్యలు కాంగ్రెస్‌ పార్టీ తీరుని చూపుతున్నాయని ఆయన అన్నారు.

కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకాన్ని కేటీఆర్‌ గుర్తు చేస్తూ, ఇది రైతులకు నిజమైన మద్దతుగా నిలుస్తోందని తెలిపారు. రేవంత్‌ రెడ్డిని విమర్శిస్తూ, “రైతుల పట్ల నిబద్ధత లేకుండా కాంగ్రెస్‌ రాబంధువులలా వ్యవహరిస్తోంది” అని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాదిలో రూ.1.38 లక్షల కోట్ల అప్పు చేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసిందని కేటీఆర్‌ ఆరోపించారు. కొత్త పెట్టుబడులు రావడం లేదని, ఉన్న కంపెనీలు కూడా రాష్ట్రం వదిలి వెళ్తున్నాయని చెప్పారు. అప్పులు తెచ్చిన డబ్బులు అభివృద్ధికి కాకుండా ఢిల్లీకి మోస్తున్నారని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలు ఇచ్చి, వాటిని నెరవేర్చలేకపోతోందని అన్నారు. హామీల అమలు గురించి ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని, ఇది దివాళాకోరు రాజకీయాల సంకేతమని విమర్శించారు.కాంగ్రెస్‌ సర్కార్‌ రైతులను మోసం చేస్తుంటే, రాహుల్‌ గాంధీ ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి తెలంగాణ రైతుల పట్ల క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ రైతులు కాంగ్రెస్‌ ప్రభుత్వ హామీల వలలో పడరాదు అని కేటీఆర్‌ సూచించారు. కేసీఆర్‌ ఉన్నప్పుడు రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయని, కాంగ్రెస్‌ విధానాలు ద్రోహం, నయవంచన అని ఆక్షేపించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Wife Husband: పెళ్లి విషయంలో ఎంత గ్యాప్ ఉండాలంటే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *