Vaishnavi Chaitanya: హీరో సోదరి, హీరోయిన్ స్నేహితురాలు పాత్రల నుండి ‘బేబీ8 సినిమాతో హీరోయిన్ గా ప్రమోషన్ పొందింది వైష్ణవి చైతన్య. అలా హీరోయిన్ గా నటించిన తొలి చిత్రంతోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఆ వెంటనే దిల్ రాజు… తన సోదరుడు శిరీష్ కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా నిర్మించిన ‘లవ్ మీ’ అనే సినిమాలో వైష్ణవిని తీసుకున్నారు. ఇక ‘బేబీ’ చిత్ర నిర్మాతలు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా మరో సినిమాను ప్రారంభించారు. ఇదిలా ఉంటే స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ మూవీలోనూ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో దీనిని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. జనవరి 4 వైష్ణవి చైతన్య పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది.