Viral news: యూపీలోని ఖాజ్ని ప్రాంతంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. గుడిలో పెళ్లి జరుగుతుండగా, వధువు ఆర్జెంట్ అవసరం ఉందని చెప్పి బాత్రూంకు వెళ్లింది. అయితే, తిరిగి రాలేకుండా ఆవిడ ఆభరణాలు, డబ్బుతో పరారైంది. ఈ ఘటనలో 40 ఏళ్ల వరుడు మోసపోయానంటూ మీడియాను ఆశ్రయించాడు.
ఏమి జరిగింది?
ఖాజ్ని ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి తొలిసారి వివాహం జరిగినప్పటికీ, అతని భార్య మరణించింది. కుటుంబాన్ని మళ్లీ స్థాపించాలనే ఉద్దేశంతో మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఒక మధ్యవర్తిని సంప్రదించి రూ. 30,000 కమిషన్ చెల్లించి సంబంధం కుదుర్చుకున్నాడు. వివాహ ఖర్చులతో పాటు వధువుకు ఆభరణాలు చేయించడానికి కూడా ఒప్పుకున్నాడు.
ముహూర్తం రాగానే గుడిలో పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వధువరులు ఇద్దరూ పీటల మీద కూర్చుని, పూజారి వివాహ కర్మ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వధువు అకస్మాత్తుగా బాత్రూంకు వెళ్లాలని చెప్పి, తన తల్లిని తోడుగా తీసుకొని వెళ్లింది. అయితే ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా, బాత్రూం ఖాళీగా ఉండటం గమనించారు. వధువు ఎక్కడా కనిపించకపోవడంతో డబ్బు, నగలతో పారిపోయిందని తెలిసింది.
బాధితుడి వేదన
ఈ మోసంతో పడ్డ దెబ్బను వరుడు మీడియా ముందు వెళ్లబోసుకున్నాడు. “ఓ కుటుంబాన్ని సృష్టించేందుకు చేసిన ప్రయత్నం నాకు పెద్ద నష్టాన్ని మిగిల్చింది. నమ్మి చేసిన వ్యాపారం నాకు చేదు అనుభవమైంది,” అంటూ వేదన వ్యక్తంచేశాడు.