Konda Surekha

Konda Surekha: ఆ మాటలు అని ఉండాల్సింది కాదు.. కేటీఆర్‌పై వ్యాఖ్యలపై కొండా సురేఖ కీలక వివరణ

Konda Surekha: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి గతంలో తాను చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పష్టతనిచ్చారు. నాటి రాజకీయ పరిస్థితుల్లో విపక్షాన్ని విమర్శించే క్రమంలోనే ఆ మాటలు అన్నానని, అంతేకానీ ఎవరినీ ఉద్దేశపూర్వకంగా నొప్పించాలనే ఆలోచన తనకు లేదని వివరణ ఇచ్చారు. ఆనాడు తాను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు మాట్లాడకుండా ఉండాల్సిందని పేర్కొంటూ, ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు (విత్‌డ్రా) ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా బహిరంగ ప్రకటన చేశారు.
కేటీఆర్‌ను గానీ, ఆయన కుటుంబసభ్యులను గానీ వ్యక్తిగతంగా బాధపెట్టాలన్న ఆలోచన లేదా వారి ప్రతిష్టకు భంగం కలిగించాలన్న దురుద్దేశం తనకు ఎంతమాత్రం లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల వల్ల కేటీఆర్, ఆయన కుటుంబం నొచ్చుకుని ఉంటే అందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నానని పేర్కొన్నారు. గతంలో తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఈ వివాదంపై ఆమె స్వయంగా వివరణ ఇస్తూ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *