KL Rahul: బోర్డర్ గవాస్కర్ సిరీస్ కు ముందు టీమిండియాకు షాక్.. ఇంట్రాస్క్వాడ్ తో వామప్ మ్యాచ్ సందర్భంగా భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడినట్లు తెలుస్తోంది. పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్ కారణంగా రాహుల్ కుడి మోచేతికి బంతి తాకడంతో ఇబ్బందిపడ్డాడు. వెంటనే ఫిజియోథెరపిస్ట్ వచ్చి ప్రాథమిక చికిత్స చేసినా.. నొప్పిగా ఉండటంతో మైదానాన్ని వీడాడు. దీంతో పెర్త్ టెస్టులో అతడు ఆడటంపై అభిమానుల్లో అనుమానాలు చెలరేగుతున్నా.. ఇప్పటివరకు రాహుల్ గాయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ఈ వామప్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ గాయం కారణంగా మైదానం వీడగా యశస్వి 15 పరుగులు, పంత్ 19 ,విరాట్ 15 పరుగులకే ఔటయ్యారు.