Max Trailer: ప్రముఖ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న చిత్రం ‘మ్యాక్స్’. ఈ పాన్ ఇండియా మూవీని కలైపులి ఎస్. థాను నిర్మించారు. ఇందులో అర్జున్ మహాక్షయ్ అనే పోలీస్ అధికారికగా సుదీప్ అలరించబోతున్నాడు. సునీల్ ప్రతి నాయకుడి పాత్రలో అలరించే ప్రయత్నంచేశారు. వరలక్ష్మీ శరత్ కుమార్, సంయుక్త హోర్నాడ్, ప్రమోద్ శెట్టి ఇతర కీలక పాత్రలను పోషించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అజనీశ్ లోకనాథ్ సంగీతం అందించారు. తాజాగా ఈసినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా సుదీప్ రక్తికట్టిస్తాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతుంది. క్రిస్మస్ కానుకగా ఈ నెల 27న ‘మ్యాక్స్’ జనం ముందుకు వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను ఏషియన్ సురేశ్ ఎంటర్ టైన్ మెంట్స్ విడుదల చేస్తోంది.
Taapsee Pannu: ‘గాంధారి’ సెట్ లో తాప్సీ!
బాలీవుడ్ కథానాయిక తాప్సీ పన్ను వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఓ పక్క వివాహితగా సంసార జీవితాన్ని సాగిస్తూనే ఇటు కెరీర్ ను ముందుకు తీసుకెళుతోంది. ప్రస్తుతం ఆమె ‘గాంధారి’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. తన ఆశీర్వాదమే బిడ్డకు శాపంగా మారినప్పుడు ఆ తల్లి మనోగతం ఎలా ఉంటుందనే కథాంశంతో ‘గాంధారి’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని దేవాశిక్ మఖిజా దర్శకత్వంలో కనికా థిల్లాన్ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పాల్గొన్నట్టుగా తాప్సీ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అతి త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.