Kiara Advani: బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కియారా చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కానీ తల్లి కాబోతున్న కారణంగా ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు మినహాయిస్తే మిగతా సినిమాల నుంచి తప్పుకుంది కియారా. అంతేకాదు త్వరలోనే మొదలు కావాల్సిన డాన్ 3 సినిమాని కూడా వదులుకుంది. దీంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకోనున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం కియారా అద్వానీ మరో రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉంటుందట. తనకు బిడ్డ పుట్టిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత రీ ఎంట్రీ ఉంటుందని ఆమె టీం చెబుతోంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.
