KTR: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వేదికగా తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కాంగ్రెస్ శ్రేణులు డప్పుల మోతతో ఫామ్‌హౌస్ ముట్టడికి యత్నించడంతో.. తమ అధినేతను పరామర్శించేందుకు, ఆయనకు స్వయంగా రక్షణగా నిలిచేందుకు అసెంబ్లీ నుంచి బయల్దేరిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు హకీంపేట వద్ద అడ్డుకుని అరెస్ట్ చేశారు.
ఈ పరిణామాలపై బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై అత్యంత తీవ్రస్థాయిలో సంచలన ఆరోపణలు గుప్పించారు. ఎర్రవల్లి ముట్టడి పేరుతో కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్‌పై కుట్రపూరితంగా హత్యాయత్నానికి పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ గారిని చంపేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు! pic.twitter.com/j719lklhYX
— KTR News (@KTR_News) September 8, 2026
కాంగ్రెస్‌కు అనుమతిచ్చి.. మమ్మల్ని అడ్డుకుంటారా?
బొల్లారం నుంచి పాదయాత్ర – హకీంపేట వద్ద నాటకీయ అరెస్టులు..
బిడ్డ రేవంత్ రెడ్డి… అన్నీ గుర్తుపెట్టుకుంటాం! pic.twitter.com/RRXdC2H2zP
— KTR News (@KTR_News) September 8, 2026
ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్
అసెంబ్లీని కేవలం బీఆర్‌ఎస్ నేతలను తిట్టడానికే వాడుకుంటున్నారని, చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. దళితులపై నిజమైన ప్రేమ ఉంటే ఎన్నికల్లో చెప్పినట్లు దళితబంధు కింద ప్రతి కుటుంబానికి రూ.12 లక్షలు ఎందుకు ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ప్రభుత్వం దిగివచ్చేంత వరకు ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.
