Devotion: కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. శివ భక్తులతో పాటు దేశంలోని హిందువులకు కార్తీక పౌర్ణమిని ఎంతో ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ కార్తీక మాసంలో హిందువులు పరమశివుడిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తుంటారు. ఇందులో ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి.. తమ భక్తిని చాటుకుంటారు. కార్తీక మాసం ప్రారంభం అయినప్పటి నుంచి చివరి వరకు తమ భక్తుని చాటుకుంటుంటారు. ఇవాళ కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు శివాలయంలో కోటి దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
దీంతో ప్రతి దేవాలయం దీపారాధనతో వెలిగిపోతుంది. తెల్లవారుజాము నుంచి మహా దేవుని దర్శనం కోసం భక్తులు ప్రధాన దేవాలయాల వద్ద బారులు తీరారు. సూర్యోదయం కాకముందే పుణ్య స్నానాలు ఆచరించి ఆలయం వద్ద ఉన్న నదులు, కాలువలు, మండపాలు, కోనేరులలో కార్తీక దీపాలు వదిలారు. అనంతరం శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు.
దీంతో తెలుగు రాష్ట్రాలు సోమవారం తెల్లవారుజాము నుంచి శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. నల్లగొండ జిల్లాలోని చెరువుగట్టు ఏపీలోని నంద్యాల జిల్లా లోని శ్రీశైలం క్షేత్రానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఆ పరమ శివుడు దర్శనం కోసం ఎంతోమంది క్యూలైన్లో వేచి ఉన్నారు.