Road Accident: హర్యానాలోని పానిపట్ నగరంలో గురువారం ఎలివేటెడ్ హైవేపై రాంగ్ సైడ్‌లోకి ఇక ట్రక్కు ప్రవేశించి బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ట్రక్కు 3 వేర్వేరు చోట్ల ఒకరి తర్వాత ఒకరుగా 6 గురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు చనిపోయారు. కాగా, ఒక యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కొంతదూరంలో లారీ డ్రైవర్‌ను పట్టుకున్నారు. ఇప్పుడు నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే రహదారిపై పడి ఉన్న మృతదేహాలను, గాయపడిన వారిని సివిల్ ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: CJI Sanjiv Khanna: సుప్రీం కోర్టులో కేసుల విచారణ రోస్టర్ మార్చిన సీజేఐ సంజీవ్ ఖన్నా
Road Accident: నిందితుడు ట్రక్ డ్రైవర్ ఎలివేటెడ్ హైవేలో రాంగ్ సైడ్‌లోకి ప్రవేశించి, శివా వంతెన ముందు బైక్ నడుపుతున్న ఇద్దరిని ఢీకొట్టాడు. ఆ తర్వాత పెట్రోల్ పంపు ముందు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల మీదకు ట్రాక్ దూసుకుపోయింది. ఇక మూడో ప్రమాదం గురుద్వారా ముందు జరిగింది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వ్యక్తి ఆస్పత్రికి చేరుకునేలోపే మృతి చెందాడు. ప్రమాదం తర్వాత, మృతదేహాలు హైవేపై పడి ఉన్నాయి. ప్రమాదం అనంతరం ఘటనా స్థలంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.