CJI Sanjiv Khanna: సుప్రీంకోర్టు 51వ సీజేఐ సంజీవ్ ఖన్నా కేసుల విచారణ కోసం రూపొందించిన రోస్టర్‌లో మార్పులు చేశారు. నవంబర్ 11న బాధ్యతలు స్వీకరించిన తర్వాత, చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని మొదటి మూడు బెంచ్‌లు .. ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు లెటర్ పిటిషన్లను .. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అంటే PILలను విచారించాలని CJI ఖన్నా నిర్ణయించారు.
కొత్త రోస్టర్ ఆఫ్ కేసుల కేటాయింపు ప్రకారం, సుప్రీంకోర్టుకు రాసిన లెటర్స్ ఆధారంగా వచ్చిన పిటిషన్లు .. PILలను CJI ఖన్నా, జస్టిస్ BR గవాయ్ .. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది.
మాజీ CJI UU లలిత్ PILలను విచారించడానికి మొత్తం 16 బెంచ్‌లను కేటాయించారు. అయితే, ఆయన వారసుడు సీజేఐ చంద్రచూడ్ ఈ విధానాన్ని నిలిపివేశారు.
ఇది కూడా చదవండి: Baba Siddique Murder Case: చనిపోయాడని నిర్ధారించుకున్నాకే.. బాబా సిద్ధిఖీ హత్య కేసులో సంచలన విషయాలు
CJI Sanjiv Khanna: లెటర్ పిటిషన్లు .. పిఐఎల్‌లు కాకుండా, సిజెఐ బెంచ్ సబ్జెక్టును బట్టి చాలా సమస్యలను విచారిస్తుంది. ఇందులో సామాజిక న్యాయం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదాలు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఎన్నికలకు సంబంధించిన అంశాలు, హెబియస్ కార్పస్, మధ్యవర్తిత్వానికి సంబంధించిన అంశాలు ఉంటాయి.
జస్టిస్ కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లను కూడా విచారించనుంది.
జస్టిస్ జేబీ పార్దివాలా సాధారణ పౌర విషయాలతో పాటు ప్రత్యక్ష-పరోక్ష పన్ను వ్యవహారాలను కూడా వింటారు.