Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్… టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ఇప్పటి వరకూ తెలుగులో తన నేరుగా నటించిన సినిమాలు అన్నీ హిట్టే. తాజాగా దీపావళికి వచ్చిన ‘లక్కీ భాస్కర్’ సైతం హిట్ కావటంతో దుల్కర్… యమ లక్కీ అనేస్తున్నారు. తండ్రి మమ్ముట్టి వారసుడిగా అడుగు పెట్టినా తనదైన బాణీతో ఆ నీడ నుంచి బయటకు వచ్చి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రత్యేకించి తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి తెలుగు దర్శకనిర్మాతలకు మోస్ట్ డిపెండబుల్ హీరో అనిపించుకున్నాడు. దుల్కర్ తెలుగులో స్ట్రెయిట్ గా నటించిన తొలి చిత్రం ‘మహానటి’. ఇందులో జెమినీ గణేశన్ గా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రేమకథా చిత్రం ‘సీతారామం’తో మరోసారి తెలుగువారి మదిని దోచాడు. ఇక ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ‘కల్కి2898ఎడి’లో అతిథి పాత్రలో మెరిశాడు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు దీపావళికి మధ్యతరగతి యువకుడు ‘లక్కీ భాస్కర్’గా మరోసారి ఆకట్టుకుంటున్నారు. తెలుగు రాస్ట్రాలలో హిట్ టాక్ తో దీపావళి విన్నర్ అనిపించుకుంటోంది. సో ఇలా ఇప్పటి వరకూ నటించిన నాలుగు సినిమాల హిట్ తో నూటికి నూరుశాతం సక్సెస్ అందుకున్న హీరోగా నిలిచాడు దుల్కర్. ప్రస్తుతం పవన్ సాదినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే రొమాంటిక్ ఎంటర్ చిత్రం చేస్తున్నాడు. మరి దుల్కర్ ఇలాగే తన సక్సెస్ ను ఎంత వరకూ కొనసాగిస్తాడో చూద్దాం.