odisha:కొందరు కార్యాలయ అధికారులు తమ పైత్యాన్ని ప్రదర్శిస్తూ ఆనందపడుతూ ఉంటారు. కానీ కిందిస్థాయి ఉద్యోగుల బాగోగులు మాత్రం వారికి అవసరం లేదు. వారి కుటుంబాల్లో ఏమైతే వారికేమి.. వారు క్షేమంగా ఉంటే చాలు. వారికి అవసరమైనప్పుడు సెలవులు పెడుతుంటారు. కానీ వారి కిందిస్థాయి ఉద్యోగులు మాత్రం తమ ఇష్టముంటే ఇస్తారు, లేకుంటే నిరాకరిస్తూ ఉంటారు. ఇలాంటి చర్యలతో ఎందరో ఉద్యోగుల కుటుంబాల్లో విషాద ఘటనలూ చోటుచేసుకుంటూ ఉంటాయి. అలాంటి కోవలోకే ఈ ఘటన వస్తుంది.
odisha:ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపరా జిల్లాలో తాజాగా జరిగిన ఓ విషాద ఘటన అందరినీ కలచి వేస్తుంది. ఆ కార్యాలయ అధికారి అహంకారంపై శాపనార్థాలు పెట్టేంత కసి పెరిగింది. అయ్యో పాపం అంటూ అందరూ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల జరిగిన ఇలాంటి ఘటనలను నెమరువేసుకుంటున్నారు. ఇంతటి నిర్దయ ఉన్న అధికారిని ఉద్యోగం నుంచే తొలగించాలని కూడా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
odisha:అక్కడి సీడీపీవో కార్యాలయం ప్రియదర్శి అనే మహిళ ఉద్యోగం చేస్తున్నది. ప్రస్తుతం ఆమె 7 నెలల గర్భిణి. అయినా ఉద్యోగ విధులు కొనసాగిస్తూనే ఉన్నది. ఎప్పటిలాగే మంగళవారం కూడా ఆమె విధులకు హాజరయింది. విధుల్లో ఉండగానే ఆమెకు కడుపునొప్పి వచ్చింది. ఆ బాధను భరించలేక సీడీపీవో వద్దకు వెళ్లి సెలవు ఇవ్వాలని వేడుకున్నది. ఆస్పత్రికి వెళ్తానని గోడు వెళ్లబోసుకున్నది. అయినా ఆ కఠిన హృదయం కరగలేదు. సెలవు ఇచ్చేదే లేదని తెగేసి చెప్పాడు. 7 నెలల గర్భిణి అని కూడా చూడకుండా కాఠిన్యం ప్రదర్శించాడు.
odisha:ఆ గర్భిణి పంటి బిగువున కడుపునొప్పి బాధను భరిస్తూ విధులను నిర్వహించింది. సాయంత్రం వరకూ ఉన్న ఆ మహిళ సరాసరి ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రికి నేరుగా వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు చెప్పిన మాటతో ఆ గర్భిణికి ప్రాణం తీసేసినంత పనైంది. గర్భంలోనే పసికందు చనిపోయినట్టు నిర్ధారించారు. దీంతో ఆ మహిళ హృదయ విదారకంగా దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈ ఘటనపై ఆ జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.
odisha:చూశారా.. ఓ కఠినాత్ముడి వల్ల అభంశుభం తెలియని పసికందు లోకం ముఖమే చూడకుండా కానరాలని లోకాలకు వెళ్లిపోయింది. మధ్యాహ్నమే సెలవు ఇచ్చి ఉంటే ఆ పసిబిడ్డ బతికి ఉండేది. ఆ మాతృమూర్తికి ఆనందం మిగిలేదు. కానీ తమ పైత్యం ఇలాంటి విషాద ఘటనలకు కారణమవుతుందని ఇలాంటి ఉన్నతాధికారులు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో కానీ మరో కుటుంబంలో మాత్రం ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవద్దని కోరుకుందాం.