Karanam Gari Veedhi: ‘కరణం గారి వీధి’ చిత్రంలో కిట్టు తాటికొండ, కష్మీరా, రోహిత్, వైశాలి, సునీల్ రావినూతల, శ్రీగోపీచంద్ కొండ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను అడవి అశోక్ నిర్మిస్ఉతన్నారు. హేమంత్, ప్రశాంత్ ద్వయం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. బ్యాక్ డ్రాప్ లో సాగే కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ పోస్టర్ ను ప్రముఖ నటులు మురళీమోహన్ చేతుల మీదుగా శుక్రవారం రిలీజ్ చేయించారు. ఈ సినిమా చక్కని విజయాన్ని అందుకోవాలనే ఆకాంక్షను మురళీమోహన్ వ్యక్తం చేశారు.