Agent Guy 001: డేవిడ్ ఆండర్సన్ దర్శకత్వంలో ఎరిక్ ఆండర్సన్ నిర్మించిన హాలీవుడ్ చిత్రం ‘ఏజెంట్ గై 001’ తెలుగులో రాబోతోంది. ఈ చిత్రానికి ఆంటోన్ క్లౌడ్ జంపర్ గెస్టిన్ సంగీతాన్ని అందించారు. బాల్టాజర్ ఫ్లోటో, ఆంటోనీ స్జోలండ్, మిల్టన్ బిజోర్నెగ్రెన్, నాట్ వెస్ట్ బ్యాక్, ఓమర్ మీర్జా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను తెలుగువారి ముందుకు పి. శ్రీనివాస్ గౌడ్ తీసుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా సినిమా టీజర్ ను విడుదల చేశారు. టీజర్ ను చూస్తే డబ్బు చుట్టూ తిరిగే ఒక పొలిటికల్ డ్రామాలా కనిపిస్తోంది. మేయర్ సీటు కోసం జరిగే ఫైట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. మరి తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.