Kamal Haasan:ప్రముఖ సినీనటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. ఈ మేరకు డీఎంకే తరఫున అభ్యర్థిగా కమల్‌హాసన్‌ను ఆ పార్టీ అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీలో తీర్మానం చేసినట్టు తెలిపారు. కమల్‌హాసన్‌తోపాటు మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా వెళ్లనున్నారు.
Kamal Haasan:2021 ఎన్నికల సమయంలో డీఎంకే పార్టీతో మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తులో భాగంగా 4 రాజ్యసభ సీట్లలో ఒక స్థానాన్ని కమల్‌హాసన్‌కు కేటాయిస్తామన్న ఒప్పందం ఉన్నది. ఈ మేరకు నాలుగు స్థానాల్లో ఒక సీటును కమల్‌హాసన్‌కు ఇచ్చేందుకు డీఎంకే ముందుకొచ్చింది.
Kamal Haasan:కమల్‌హాసన్ 2018లో మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు. ఆయన తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన మార్పును తీసుకురావాలని ప్రయత్నిస్తూ వస్తున్నారు. అవినీతి రహిత పాలన, ప్రజల సమస్యలపై పోరాటం ఆయన ప్రధాన ఎజెండాలుగా పెట్టుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో, అలాగే 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లోనూ మక్కల్ నీది మయ్యం పార్టీ పోటీ చేసింది. ఆ రెండు ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్దగా విజయం సాధించలేకపోయింది. కమల్ స్వయంగా పోటీ చేసిన కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.