Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు పొలిటీషియన్ కూడా! రాజకీయ పార్టీని పెట్టి వచ్చే యేడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన చివరి చిత్రం ఒకటి చేస్తున్నారు. దానికి హెచ్ వినోద్ డైరెక్టర్. ఈ సినిమాకు వినోదే కథను తయారు చేసినా… రాజకీయ నేపథ్యంతో కూడిన కథాంశం కావడంతో కమల్ హాసన్ సైతం ఇన్ పుట్స్ ఇవ్వబోతున్నారట. నటుడిగా, రాజకీయ నాయకుడిగా అనుభవం ఉన్న కమల్ హాసన్… ఈ సినిమాలో విజయ్ పాత్ర ఎలా ఉండాలి? కథ, కథనాలు ఎలా ఉండాలి? అనేది దగ్గర ఉండి చూసుబోతున్నారట. తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో ఈ సినిమా కథ తయారీలో కమల్ కూడా పాల్గొంటున్నారని అంటున్నారు. వచ్చే యేడాది అక్టోబర్ 25న ఈ మూవీ విడుదల కానుంది. మరి ప్రస్తుతం డీఎంకే పార్టీకి మద్దత్తు ఇస్తున్న కమల్ హాసన్ ఆ టైమ్ కు విజయ్ పార్టీ కు సహకరిస్తారేమో చూడాలి.