Kalvakuntla Kavitha: కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద బీసీ మహాసభ జరిగింది. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచాలన్న ప్రధాన డిమాండ్లతో కవిత నేత్రుత్వంలో ఈ ధర్నా చేపట్టారు.
Kalvakuntla Kavitha: బీసీల మహాధర్నానుద్దేశించి ముఖ్య అతిథిగా హాజరైన కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా సావిత్రీబాయి ఫూలేకు ఘనంగా నివాళులర్పించారు. సావిత్రీబాయి ఫూలే జీవితంలో ఎదరైన అనుభవాలను, ఆమె సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా కవిత కొనియాడారు. డిడికేషన్ కమిటీ వేయకుండా బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తుందని కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Kalvakuntla Kavitha: బీసీలను అటు రాష్ట్రంలోని కాంగ్రెస్, ఇటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్ బీసీలకు తీరని ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. కులగణనకు తాము వ్యతిరేకమని బీజేపీ చెప్తున్నదని తెలిపారు. మండల్ కమిషన్ సిఫార్సులను ఇందిరమ్మ ప్రభుత్వం పదేండ్లపాటు బీరువాలో పెట్టి కాలయాపన చేసిందని ఆరోపించారు. నెహ్రూ, ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే జరిగిందని చెప్పారు.