Kakarla Suresh: నెల్లూరు జిల్లా ఉదయగిరిపై రాజకీయ పార్టీలు, నాయకులు చూపుతున్న నిర్లక్ష్యంతో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి. పేరుకు నెల్లూరు జిల్లాలో ఉన్నప్పటీకి నిధుల కేటాయింపు అభివృధ్ది పనుల్లో మాత్రం ఉదయగిరి తీవ్ర నిర్లక్ష్యంకు గురవుతుంది.
గత ముఫ్పై ఏళ్లుగా చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఇతర నియోకవర్గాలకు ఇస్తున్న నిధులు, అక్కడ జరుగుతున్న డెవలప్‌మెంట్‌కు ఉదయగిరికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అయినప్పటీకి కాకర్ల సురేష్ ఇష్టంగా ఏరి కోరి తన సోంత ప్రాంతంపై ప్రేమతో రాజకీయలతో సంబంధం లేకుండా ఇక్కడ కాకర్ల ట్రస్ట్‌తో రెండేళ్ల పాటు పలు సేవ కార్యక్రమలు నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యారు. ఉదయగిరి ప్రజలకు మేలు చేయాలనే ఆకాంక్షతో అమెరికా నుంచి వచ్చి పక్కా పల్లెటూర్లలో తిరుగుతూనే కూటమి నుంచి ఎమ్మెల్యేగా గెలుపోందారు. ఉదయగిరిలో కూటమికి విజయవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు కనిపించాయి.
Kakarla Suresh: కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉదయగిరిలో బలమైన రాజకీయ కుటుంబం మేకపాటి బ్రదర్స్‌పై కోట్లు కుమ్మరించి అనుహ్య విజయాన్ని అందుకున్నారు కాకర్ల సురేష్… ఉదయగిరిపై ప్రేమతో అమెరికా నుంచి వచ్చి మేకపాటి కుటుంబంపై గెలిచారు.ఇప్పుడు ఉదయగిరికి నిధులు తెవడం,ఇక్కడ పరిశ్రమలు పెట్టించడం, కూటమి ప్రభుత్వం చేత అభివృద్ధి పనులు చేయించడం పెద్ద సాహసంగా మారిందంటా…
అటవీ ప్రాంతం, కొండలు, గుట్టలు ఎక్కువగా ఉండే ఉదయగిరిలో గత ముఫ్పై ఏళ్ల కాలంలో చూసుకుంటే రాజకీయ పార్టీలు అభివృద్ధిని గాలికి వదిలేశాయి. హైదరాబాద్, బెంగళూరు, చైన్నైలలో వందల కోట్లు డబ్బున్నా కోటీశ్వరులు వందల ఎకరాల భూములు కోనడం, వాటిని బ్యాంక్‌ల్లో పెట్టి మార్కెట్ రేటు పెంచుకుని కోట్లు కోట్లు లోన్‌లు తీసుకోవడం జరుగుతుందంటా…ఆంధ్ర- తెలంగాణాల్లో ఉన్న ప్రముఖలు, కంపెనీలు, వైసీపీ, టీడీపీ, బీజేపీ బడా లీడర్లకు ఉదయగిరిలో వేల ఎకరాల భూములు ఉన్నాయంటా…విదేశాల్లోని ఎన్ఆర్ఐలకు కూడ ఉదయగిరికి పలు మండలాల్లో వేల ఎకరాల భూములు ఉన్నాయి. భూములు అయితే కొంటారు. బ్యాంక్‌లోన్‌లు అయితే తీసుకుంటారు. సోంత అవసరాలు, వ్యాపార అవసరాలకు వాడుకుంటారు.ఉదయగిరి అభివృద్ధికి మాత్రం వీరికి మనసు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Kakarla Suresh: ఉదయగిరిలో గ్రీన్ ఎనర్జీ,సోలార్ ఎనర్జీ ఆధారిత పరిశ్రమలు పెట్టడానికి బోలెడు ఆవకాశలు ఉన్నాయి. యువత, మహిళలకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చి, చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి ఆవకాశాలు పెరుగుతాయి. ఉదయగిరి కోండపై ఉన్న కోటని టూరిజం స్పాట్‌గా మారే అవకాశం ఉంది. నర్రవాడ వెంగమాంబ గుడిని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృధ్ది చేస్తే భక్తుల రాకపోకలు పెరుగుతాయి.
ఉదయగిరిలో పరిశ్రమల ఏర్పాటు, స్వయం ఉపాధి, టూరిజం డెవలప్‌మెంట్, మెట్ట పల్లెల్లో రోడ్ల వసతి, వైద్య వసతులు మెరుగుపరచడంపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారని ప్రచారం ఉంది. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు, పరిశ్రమలు తెచ్చేందుకు కాకర్ల సురేష్ ప్రణాళికలు సిధ్దం చేసుకోని తెగ తిరుగుతున్నారంటా…ఉదయగిరి వాసులు దేశంలో చాలా చోట్ల రియల్ ఎస్టేట్ రంగం, బిల్డర్స్ ఫిల్డ్, విదేశాల్లో పలు వ్యాపారాల్లో అత్యున్నత స్దితిలో ఉండే శ్రీమంతులు ముందుకు వచ్చి తమ సోంత ప్రాంతాల అభివృధ్దికి సహకరించాలని నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు.