KADAPA: తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం, ఖర్చుల వివరాలను బహిరంగంగా ప్రకటించింది. పార్టీ కోశాధికారి పార్థసారథి వెల్లడించిన వివరాల ప్రకారం, సభ్యత్వ రుసుములు ద్వారా రూ. 123.19 కోట్లు, విరాళాల ద్వారా రూ. 82.05 కోట్లు, వడ్డీ ఆదాయంగా రూ. 23.05 కోట్లు వచ్చేలా మొత్తం ఆదాయం రూ. 228.31 కోట్లుగా నమోదైంది.
ప్రచార వ్యయం రూ. 31.73 కోట్లు, కార్యాలయ అద్దె, నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు, బీమా ఖర్చులు ఇలా కలిపి మొత్తం ఖర్చు రూ. 61.33 కోట్లు. దీంతో మిగిలిన మొత్తంగా రూ. 166.98 కోట్లు ఉందని వెల్లడించారు. అంతేకాకుండా, కార్యకర్తల సంక్షేమ బీమా కోసం ఏకంగా రూ. 48.09 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. 2025 మార్చి 31 నాటికి టీడీపీ జనరల్ ఫండ్ మొత్తం రూ. 469.42 కోట్లు కాగా, ఈ నివేదికను సభ్యుల ఆమోదానికి సమర్పించారు