K.lakshman: మూసీ నివాసితుల ఇండ్లు కూల్చే ప్రయత్నం చేస్తే.. బుల్డోజర్ లకు అడ్డం నిలబడుతామన్నారు బీజేపీ నేత కే. లక్ష్మణ్. మూసీ ప్రక్షాళన చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయన్నారు. మూసీ నివాసాలపై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని హెచ్చరిస్తున్నామన్నారు. మలక్ పేట శాలివాహన నగర్ లో నిద్ర చేశారు. ఉదయం కార్యకర్తలతో కలిసి అల్పాహారం సేవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..వారసత్వంగా మూసీ నివాసితులు ఇక్కడ నివసిస్తున్నారని గుర్తుచేశారు. మూసీకి ఇరువైపులా గోడలు నిర్మించి.., ఎస్టీపీ లు ఏర్పాటు చేసి, డ్రైనేజీ వ్యవస్థను మార్చే అవకాశం ఉందన్నారు.
కానీ పేదల ఇండ్లు బుల్డోజర్ల తో కూల్చి వేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు అహంకార పూరితంగా మాట్లాడడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. మీ ప్రతాపం పేదల మీదనా అని ప్రశ్నిస్తే.. బీజేపీ నీ కూడా విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించిన గ్యారెంటీల విషయంలో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారన్నారు.అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టర్ల జేబులు నింపే మార్గాలు అన్వేషిస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఈ మూసి ప్రక్షాళన అని తెలిపారు. ఉత్తరాఖండ్ కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు.
అక్కడి మంత్రులే బాహాటంగా విమర్శిస్తున్నారని తెలిపారు.మూసీ ప్రక్షాళన కు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మూసీ శుద్ధీకరణ చేయాలి.. పరిశుద్దంతో ప్రవహించి నల్గొండ, భాగ్యనగర్ ప్రజలకు ఉపశమనం కల్గించాలన్నారు. అందుకు అనేకమైన మార్గాలు ఉన్నప్పట్టికీ.. లక్షా యాభై వేల కోట్లతో మూసీ శుద్ధీకరణ అంటున్నారని తెలిపారు.