K-4 Ballistic Missile Test: భారత నౌకాదళం కె-4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అణు జలాంతర్గామి అరిఘాట్ నుంచి ఈ పరీక్ష జరిగింది. ఆరిఘాట్‌ను 2017లో ప్రారంభించారు. దీని అప్‌గ్రేడ్ వెర్షన్ త్వరలో కమిషన్ చేయనున్నారు. అరిఘాట్ జలాంతర్గామి INS అరిహంత్ అప్‌గ్రేడ్ వెర్షన్. విశాఖపట్నంలోని ఇండియన్ నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్ లో దీన్ని నిర్మించారు. అరిఘాట్‌లో 3500 కి.మీ పరిధి గల కె-4 క్షిపణులను అమర్చారు. ఈ జలాంతర్గామి బరువు 6 వేల టన్నులు.
ఇది కూడా చదవండి: Delhi:డిసెంబర్ 2కి రాజ్య సభ వాయిదా
K-4 Ballistic Missile Test: ఇప్పటి వరకు అణు క్షిపణులతో కూడిన 3 జలాంతర్గాములను భారత్ సిద్ధం చేసింది. వీటిలో ఒకటి అరిహంత్ లో కమిషన్ చేశారు. రెండవ క్షిపణిని అరిఘాట్ లో అమర్చనున్నారు. మూడవ క్షిపణి పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ జలాంతర్గాముల ద్వారా శత్రు దేశాలపైకి అణు క్షిపణులను ప్రయోగించవచ్చు. 2009లో తొలిసారిగా ఐఎన్‌ఎస్ అరిహంత్‌ను కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సతీమణి లాంఛనంగా ప్రారంభించారు. తరువాత దీనిని 2016 లో నావికాదళంలో చేర్చారు. తరువాతి ఐదేళ్లలో భారత నావికాదళం మరో రెండు జలాంతర్గాములను ప్రారంభించింది.