Jee Mains: ఎన్ఐఐటీ కాలేజీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్ పేపర్-1 ఆన్‌లైన్ పరీక్షలు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి. 22న ప్రారంభమయ్యే పరీక్షలు 23, 24, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. చివరిరోజైన 30న బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల భర్తీ కోసం పేపర్-2 నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఈ రెండు పేపర్లకు కలిపి 12 లక్షల మందికిపైగా దరఖాస్తులు చేశారు.
Jee Mains: జేఈఈ పేపర్-1, పేపర్-2 పరీక్షలను రాసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.5 లక్షల మంది హాజరుకానున్నారు. ఉదయం మధ్యాహ్నం రెండు షిప్ట్‌లలో పేపర్-1 పరీక్షలు జరుగుతాయి. పరీక్ష గడువుకు మూడు రోజుల ముందుగా హాల్‌టికెట్లను ఎన్టీఏ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతుంది.
Jee Mains: అభ్యర్థులు పరీక్ష సమయానికి 2 గంటల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఎన్టీఏ నిబంధనలు విధించింది. అడ్మిట్ కార్డులో ఉన్న నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించింది. సాధారణ వస్త్రాలనే ధరించి రావాలని, బూట్లకు బదులు సాధారణ చెప్పులే ధరించి రావాలని సూచించింది.
Jee Mains: అడ్మిట్‌కార్డులో కింద ఉంచి ఒక బాక్సులో పాస్ ఫొటో అంటించాల్సి ఉంటుందని ఆన్‌లైన్ అప్లికేషన్ దరఖాస్తు ఫారంలో పెట్టిన పాస్ ఫొటోనే అతికించాల్సి ఉంటుందని పేర్కొన్నది. బ్లూ లేదా బ్లాక్ పెన్ను, ఆధార్, పాన్ కార్డు ఒరిజినల్ కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించింది.