Planets in a Row

Planets in one Row: మరో కొన్ని గంటల్లో ఆకాశంలో అద్భుతం.. మిస్ అవకుండా చూసేయండి!

Planets in one Row: అప్పుడప్పుడు ఆకాశంలో అద్భుతాలు జరుగుతుంటాయి. సాధారణం కంటే భిన్నంగా ఏదో  ఒక ద్విగ్విషయం చోటు చేసుకుంటుంది. ఆకాశం అంటేనే సంభ్రమాశ్చర్యాలు కలిగించే ఎన్నో విషయాలకు నిలయం కదా. అలా మనల్ని ఆశ్చర్యపరిచే విషయాల్లో కొన్ని మన కంటికి అప్పుడప్పుడు కనిపిస్తాయి. వాటిని మిస్ అయితే, మళ్ళీ మన జీవితంలో అలాంటి అవకాశం రాకపోవచ్చు. అలాంటిదే ఒక అరుదైన అద్భుతం మరికొన్ని గంటల్లో జరగబోతోంది. 

Planets in one Row: జనవరి 22 నుంచి 25 వరకు ఆకాశంలో 6 గ్రహాలు ఒకేసారి ఒకే లైన్ లో కనిపించనున్నాయి. ఈ అద్భుతాన్ని ప్రజలందరూ వీక్షించేందుకు వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆకాశంలో గ్రహాలు ఒకే క్రమంలో కనిపించడం అసాధారణం కానప్పటికీ, వాటిలో అనేకం ఒకేసారి కనిపించడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘటన ఇప్పుడు జరగబోతోంది. జనవరి 22 నుంచి 25వ తేదీ వరకు 6 గ్రహాలు ఏకకాలంలో ఒకే వరుసలో ఉండడం ఖగోళ శాస్త్ర ప్రియులను ఆనందపరుస్తుంది. ఈ ఆరు గ్రహాలలో శుక్రుడు, బృహస్పతి, శని – అంగారక గ్రహాలను కంటితో చూడవచ్చు. కానీ నెప్ట్యూన్ – యురేనస్‌లను శక్తివంతమైన బైనాక్యులర్‌లతో మాత్రమే చూడగలుగుతాం. 

Planets in one Row: జనవరి జనవరి 22 నుండి 25వ తేదీ వరకు, తమిళనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ చెన్నైలోని కొట్టుపురంలోని పెరియార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్‌లో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ప్రజల సందర్శనను ఏర్పాటు చేసింది. కోయంబత్తూరులోని రీజనల్ సైన్స్ సెంటర్‌లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు.

Planets in one Row: ఈ సందర్భంగా వాతావరణ నిపుణులు మాట్లాడుతూ.. ప్రజల కోసం ప్రత్యేకంగా రాత్రిపూట ఆకాశ పరిశీలనను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇలా ప్రజలు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.  అయితే, మీరు మీ టెర్రస్ నుండి లేదా బీచ్ నుండి వీనస్, బృహస్పతి, శని, అంగారక గ్రహాలను నేరుగా చూడవచ్చు.
Planets in one Row: రాత్రి 9 గంటలకు అంగారకుడు ఉదయిస్తాడు. ఈ గ్రహాలన్నింటినీ ఒక్కొక్కటిగా చూడవచ్చు. గ్రహాలు ఒకదానికొకటి మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. యురేనస్, నెప్ట్యూన్‌లను పెద్ద టెలిస్కోప్‌తో చూడగలిగినప్పటికీ, వాటిని నక్షత్రాల మధ్య గుర్తించడానికి నైపుణ్యం అవసరం. ఇలాంటిది ప్రతి సంవత్సరం జరగదు అని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Prabhas: 17 ఏళ్ళ తర్వాత ప్రభాస్ తో నయనతార!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *