Japan Masters 2024

Japan Masters 2024: ప్రిక్వార్టర్స్ లో సింధు

Japan Masters 2024: జపాన్‌ మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సింధు విజయంతో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌ చేరగా.. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ నిష్క్రమించాడు. దీంతో భారత్ కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.

Japan Masters 2024: జపాన్‌ మాస్టర్స్‌ సూపర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు విజయంతో ప్రిక్వార్టర్స్‌ చేరింది. తొలి రౌండ్లో సింధు 21-12, 21-8 తేడాతో థాయిలాండ్ కు చెందిన ఎనిమిదో సీడ్‌ బుసానన్‌ ను వరుస గేముల్లో చిత్తుచేసింది. గత రెండేండ్లుగా ఒక్క టైటిల్ కూడా గెలుచుకోని సింధు.. ఈ టోర్నీని అద్భుతంగా మొదలు పెట్టింది. ప్రపంచ 20వ ర్యాంకర్‌గా కొనసాగుతున్న సింధు.. మ్యాచ్‌లో గొప్ప పోరాట పటిమను ప్రదర్శించింది. తొలి గేమ్‌ ఆరంభంలో 1-5తో వెనుకబడ్డ తర్వాత సింధు అద్భుతంగా పుంజుకుంది. విరామ సమయానికి 11-10తో ఆధిక్యం సంపాదించిన తర్వాత మరింత దూకుడుగా ఆడింది. రెండో గేమ్‌లోనూ జోరు కొనసాగించి మ్యాచ్‌ సొంతం చేసుకుంది. ప్రిక్వార్టర్స్‌లో కెనడా షట్లర్ మిషెల్లీతో సింధు తలపడనుంది. మరోవైపు తొలి రౌండ్లో లక్ష్యసేన్‌ 22-20, 17-21, 16-21తో మలేసియా షట్లర్ లియాంగ్‌ చేతిలో పోరాడి ఓడాడు. తొలి గేమ్‌ను దక్కించుకున్న లక్ష్య.. ఆ తర్వాత ఒత్తిడిలో తడబడి పరాజయం పాలయ్యాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Team India: పోస్టుమార్టం తప్పదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *