Prasanth Varma: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా రూపొందిన సూపర్ హీరో సినిమా ‘హనుమాన్’ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ తీస్తున్నట్లు ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. నిజానికి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ ఉంటుందని ప్రకటించినా ఇప్పటి వరకూ దానికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. మధ్యలో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తూ సినిమా కమిట్ అయ్యాడు. ఇదిలా ఉంటే దీపావళికి ‘జై హనుమాన్’ అప్ డేట్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో సంకేతాలు ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. బుధవారం తన ట్విట్టర్ లో కోతితో ఉన్న పిక్ పోస్ట్ చేసి ‘మేము మళ్ళీ కలిశాం. ఇదే సంకేతం’ అనే ట్వీట్ తో పాటు ‘దీపావళి వస్తుంది’ అనే ట్యాగ్ పెట్టాడు. దీంతో అందరూ అది ‘జై హనుమాన్’ గురించి హింట్ గా భావిస్తున్నారు. ఇప్పటకే ‘జై హనుమాన్’లో రిషబ్ శెట్టి నటించబోతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరి అందరూ ఊహిస్తున్నట్లు దీపావళికి ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ అప్ డేట్ ఏమైనా ఇస్తాడేమో చూద్దాం.