Jagapathi Babu: రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’లో కీలక పాత్రను పోషించాడు జగపతిబాబు. భిన్నమైన ఆహార్యంతోనూ, బాడీ లాంగ్వేజ్ తోనూ ఆకట్టుకున్నాడు కూడా! ఇప్పుడు సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు…. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న మూవీలోనూ జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన గెటప్ చూసిన తర్వాత చాలా తృప్తిగా అనిపించిందని జగపతిబాబు తెలిపాడు. చాలా కాలం తర్వాత సానా బుచ్చిబాబు మంచి పనిపెట్టాడని మెచ్చుకున్నాడు. తాను మేకప్ వేయించుకుంటున్న వీడియోనూ జగ్గుభాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతి వైరల్ అయిపోయింది.
Chaala Kaalam tharavaatha @BuchiBabuSana #RC16 ki manchi pani pettaadu.. get up choosina tharavaatha Naaku chaala thrupthi ga undhi. pic.twitter.com/aaiQ8HPErp
— Jaggu Bhai (@IamJagguBhai) January 16, 2025