Pushpa: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో పుష్ప చెప్పినవన్నీ అబద్ధాలేనా… ప్రస్తుతం అల్లు అర్జున్‌కు నెటిజన్లు వేస్తున్న ప్రశ్న… సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా… ఆమె కుమారుడు శ్రీతేజ స్పృహ తప్పాడు. ఇప్పటికీ కోమాలో కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయంపై అల్లు అర్జున్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని, శ్రీతేజ వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని చెప్పారు.అంతే కాదు బాధిత కుటంబానికి రూ. 25 లక్షల నష్టపరిహారం కూడా ప్రకటించారు.సంధ్య థియేటర్ తొక్కిసలాటలో శ్రీ తేజకు ఆక్సిజన్ అందక బ్రెయిన్ పని చెయ్యక ఇప్పటికీ కోమాలోనే ఉన్నాడు.
Pushpa: శ్రీ తేజ వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేప్పారు.ఆ రోజు సీసీ టీవీ ఫూటేజ్ చూస్తే రేవతిని అంబులెన్స్‌లో పోలీసులే తరలించినట్లుగా కనిపిస్తోంది.స్పృహ తప్పిన మహిళను పోలీసులే మరోచోటకు తీసుకెళ్లి సీపీఆర్ చేస్తున్న దృశ్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.మృతురాలి కుటుంబానికి రూ. 25 లక్షలు ఇస్తున్నామని చెప్పినా ఇప్పటికీ ఇవ్వలేదని సీవీ ఆనంద్ తెలియజేశారు. ఇచ్చి ఉంటే ఇప్పటికే ఆర్భాటంగా ప్రకటించేవారు.
ఇది కూడా చదవండి: Jagan: అవినాష్‌పై జగన్ అసహనం ఫ్యామిలీలో చిచ్చు మొదలైందా
Pushpa: ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి తాము ముందే పోలీసులకు సెక్యూరిటీ కోసం లేఖ రాశామని థియేటర్ యాజమాన్యం, పుష్పా టీమ్ చెబుతోంది. కానీ వాస్తవానికి పోలీసులు రాసిన సమాధానాన్ని తొక్కిపెట్టారు. హీరో వస్తే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని, వద్దని చెప్పమని పోలీసులు స్పష్టంగా రాశారు.అయినా హీరోతో పాటే టీమ్ రావడం, అది కాకుండా ఓపెన్ టాప్‌లో అభివాదం చెయ్యడం, కాన్వాయ్‌తో రావాడం ఇలాంటి కారణాల వల్లే తొక్కిసలాట జరిగిందనీ టాక్ నడుస్తోంది.
Pushpa: మరోవైపు ఈ కేసును నిరంజన్ రెడ్డి వాదిస్తూ కోర్టులో పోలీసులు అసలు కింద లేరని, ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నారని చెప్పారు. అల్లు అర్జున్‌ను చూడడం కోసం పోలీసులు వేచి ఉన్నారమే… తమ విధులు నిర్వర్తించలేదేమో అంటూ ఎగతాళిగా మాట్లాడారు. కానీ విజువల్స్ చూస్తే స్పష్టంగా పోలీసులు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండడమే కాదు. తమ విధులు నిర్వర్తిస్తూ గాయపడిన వారిని చికిత్స కోసం తరలిస్తూ కనిపించారు. అంటే పుష్ప చెప్పినవన్నీ అబద్దాలేనా….సోషల్ మీడియాలో నెటిజన్లు అడుగుతున్నారు…పుష్ప ఏమి సమాధానం చెబుతారో చూడాలి మరి.