Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. గత శుక్రవారం కూడా అలాగే ఓ స్కూల్ కి బాండ్ బెదిరింపులోతో మెయిల్ వచ్చింది. దింతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల్ వచ్చిన రెండు బెదిరింపు మెయిల్స్ మాత్రం విద్యార్థులు లే పంపినట్టు తేలింది.
ఢిల్లీ లోని రోహిణి జిల్లాకు చెందిన రెండు స్కూల్‌లకు చెందిన ఇద్దరు విద్యార్థులు బాంబు బెదిరింపులతో కూడిన మెయిల్స్ తమ స్కూల్ లకి పంపించారు అని ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు. ఇంకో స్కూల్ కి వచ్చిన బెదిరింపు కూడా ఇంతే అని తెలిపారు. తాము ఎక్సమ్ కి సిద్ధం గ లేనందున వాటిని వాయిదా వేయడానికి ఇలా చేశాం అని విచారణ లో తెలిపారు. ఢిల్లీలో బాంబు బెదిరింపులు తరచుగా రావడంతో వాటినుండి ప్రేరేపణ పొంది ఇలా చేశారు అని విచారణలో తేలింది. విద్యార్థులు కావడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు పోలీసులు. వాళ్లతో తో పేరెంట్స్ కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు.