ap assembly

AP Assembly: వాళ్ళు మీలా కాదు.. మిమ్మల్ని ఏమీ అనరు.. అసెంబ్లీకి వెళ్ళండి!

AP Assembly: అధికారంలో ఉన్నన్నాళ్లూ తామంతటి వారు లేమనుకుంటూ విర్రవీగారు. తమది శాశ్వతమైన అధికారం అన్నట్టుగా.. నోటికి ఇష్టం వచ్చినట్టు విపక్షాలపై బూతు పురాణంతో దాడి చేశారు. మహిళలు.. కుటుంబ సభ్యులు.. ఆఖరికి విపక్ష నాయకుల పిల్లలపై కూడా దారుణమైన ట్రోలింగ్.. వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డారు. వైసీపీ బ్యాచ్ నోటి తీటకు చిక్కని విపక్ష నేత లేరంటే అతిశయోక్తి కాదు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో విధ్వంసకర పాలన సాగించడమే కాకుండా.. అసెంబ్లీలో కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ విపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కించపరిచారు జగన్ అండ్ కో. అయినా సరే, అవమానాలు భరిస్తూనే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు తెలుగుదేశం సభ్యులు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ సభ్యులు. అధికార దర్పంతో అనరాని మాటలు అనడమే కాకుండా.. విపక్ష నేత.. సీనియర్ అని కూడా చూడకుండా చంద్రబాబు సతీమణిపై అవాకులు చవాకులు అసెంబ్లీ సాక్షిగా పేలారు. దీంతో మనస్తాపం చెందిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి దూరం జరిగారు. అయితే, మిగిలిన తెలుగుదేశం సభ్యులంతా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. వైసీపీని ఎదుర్కుంటూ.. ప్రజల పక్షాన తమ గళం వినిపించే ప్రయత్నం చేశారు. 

ఇది కూడా చదవండి: Ap news: రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

AP Assembly: ఇప్పుడు సీన్ మారింది. వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకు ప్రజలు విస్పష్టమైన లెక్కలు ఎన్నికల్లో చూపించారు. కేవలం 11 సీట్లకు పరిమితం చేసి.. కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. దీంతో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పటి ఎమ్మెల్యే అభద్రతా భావంలో పడిపోయినట్టు కనిపిస్తోంది. తాను అప్పుడు చేసిన పాపాలు కళ్ళముందు ప్రత్యక్షం అవుతున్నట్టున్నాయి. ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడినే తాము మానసిక క్షోభకు గురిచేస్తే.. సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడితే తనను టీడీపీ సభ్యులు ఒక ఆట ఆదుకుంటారని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే, అసెంబ్లీకి రాను అంటూ కరాఖండిగా చెప్పేయడమే కాకుండా.. తన పార్టీ సభ్యులను కూడా హాజరు కావద్దని సూచించారు. దీంతో కీలకమైన బడ్జెట్ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ దూరంగా ఉండిపోయారు. 

ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? వైసీపీ నిర్ణయాన్ని వారు సమర్థిస్తున్నారా? రాష్ట్రమంతా సరే.. తాము గెలిపించుకున్న ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ పనిపై ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు ఏమంటున్నారు? మహా న్యూస్ దీనిపై ఆ 11 స్థానాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. 

ALSO READ  Duvvada Srinivas: తిరుమల కొండెక్కిన దువ్వాడ ఫ్యామిలీ వార్

ఇది కూడా చదవండి: YS Sharmila: అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది జగన్ తీరు.. మీకు ఓట్లేసింది ఇందుకేనా

AP Assembly: అసెంబ్లీకి తామెన్నుకున్న సభ్యులు వెళ్లకపోవడంపై వైసీపీని గెలిపించిన నియోజకవర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. దాదాపు 80 శాతం మంది వైసీపీ నిర్ణయం సరైనది కాదని అంటున్నారు. తమ సమస్యలు అసెంబ్లీలో వినిపించాల్సిన ఎమ్మెల్యేలు.. సభకు హాజరు కాకుండా తప్పించుకోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మనం ఎదుటి వారికి ఏమిచ్చామో అదే మనకూ తిరిగి వస్తుందనేది సామెత అయితే, ఇక్కడ వైసీపీ తాము అప్పట్లో తప్పు చేసాం అనే అపరాధ భావం వెంటాడుతున్నట్టుంది అని ప్రజలు అంటున్నారు. అయితే, ఇక్కడ ఒక విషయం వారంతా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

వైసీపీ నాయకులు వ్యవహరించినంత జుగుప్సాకరంగా టీడీపీ సభ్యులు వ్యవహరించారని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ నుంచి విమర్శలు రావచ్చు కానీ.. నాయకుల భార్యలను.. పిల్లలను బూతులతో నిందించే పరిస్థితి ఉండదనే ప్రజలు అనుకుంటున్నారు. మీరు వెళ్ళండి.. వారేమీ అనరు అంటూ కొందరు చెబుతున్నారు. వెళితే కదా తెలిసేది.. మీకులా వారు కూడా దిగజారి ప్రవర్తిస్తే ఏమి జరుగుతుందో వారికి స్పష్టత ఉందని ప్రజలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయాలు పరిణితితో ఉంటాయనీ.. వ్యక్తిగత దూషణలను  ఆయన ఎప్పుడూ సమర్ధించారనీ ప్రజలు నమ్ముతున్నారు. అనుమానాలు పక్కన పెట్టి.. లేనిపోని రాద్ధాంతాలను సృష్టించి ప్రజలను ఇంకా మోసగించవద్దని కోరుతున్నారు. తమ ఎమ్మెల్యేలు కచ్చితంగా అసెంబ్లీకి వెళ్లాలని.. అక్కడ తమ వాణిని వినిపించాలని ప్రజలంతా బలంగా కోరుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *