AP Agriculture Budget

AP Agriculture Budget: రైతన్నలకు వెన్నుదన్నుగా ఏపీ వ్యవసాయ బడ్జెట్!  అన్నదాత సుఖీభవ అమలు కూడా 

AP Agriculture Budget: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. సాధారణ బడ్జెట్ ను ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ ముందుగా శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆ తరువాత వ్యవసాయ బడ్జెట్ ను ప్రత్యేకంగా సభ ముందు ఉంచారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ వ్యవసాయానికి బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెడుతూ వస్తారు. అదేవిధంగా ఈసారి కూడా వ్యవసాయానికి సంబంధించి బడ్జెట్ ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. మొత్తం రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదించారు. రైతుల కోసం పలు సదుపాయాలను ఈ బడ్జెట్ లో పొందుపరిచారు. అలాగే, కూటమి ప్రభుత్వ హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ పతాకంపై ఈ బడ్జెట్ లో ఒక స్పష్టతను ఇచ్చారు. మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన ఏపీ వ్యవసాయ బడ్జెట్ లో హైలైట్స్ ఇవే.. 

AP Agriculture Budget: రూ.43,402.33 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్

వ్యవసాయ రంగానికి పెద్దపీట

వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్

వ్యవసాయశాఖకు రూ.8,564 కోట్లు – 

అన్నదాత సుఖీభవ రూ.4,500 కోట్లు – 

ఉద్యానశాఖకు రూ.3,469 కోట్లు – 

వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు –  

వడ్డీ లేని రుణాలకు రూ.628 కోట్లు – 

రైతు సేవా కేంద్రాలకు రూ.26.92 కోట్లు –

ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ.44.03 – 

పంటల బీమాకు రూ.1,023 కోట్లు – 

పట్టు పరిశ్రమలకు రూ.108 కోట్లు – 

వ్యవసాయ మార్కెటింగ్ రూ.314.80 కోట్లు – 

సహకార శాఖకు రూ.308.26 కోట్లు – 

పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ.11.31 కోట్లు –  

రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు – 

ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు  – 

ప్రకృతి వ్యవసాయానికి రూ.422.96 కోట్లు – 

డిజిటల్ వ్యవసాయం కోసం రూ.44.77 కోట్లు – 

ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీకి రూ.507 కోట్లు –

ఉద్యాన వర్సిటీకి రూ.102.22 కోట్లు – 

ఎస్వీ పశు విశ్వవిద్యాలయానికి రూ.171.72 కోట్లు – 

మత్స్య విశ్వవిద్యాలయానికి రూ.38 కోట్లు – 

పశుసంవర్థకశాఖకు రూ.1095.71 కోట్లు – 

మత్స్యరంగ అభివృద్ధికి రూ.521.34 కోట్లు – 

వ్యవసాయ ఉచిత విద్యుత్ కు రూ.7,241.30 కోట్లు – 

ఉపాధి హామీ అనుసంధానానికి రూ.5,150 కోట్లు – 

ఎన్టీఆర్ జలసిరికి రూ.50 కోట్లు – 

ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు రూ.14,637.03  కోట్లు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *