Indian 3: కమల్ హాసన్, శంకర్ కలయికలో వచ్చిన ‘ఇండియన్ 2’ డిజాస్టర్ కావటంతో ఇక ‘ఇండియన్3’ రాదనే నిర్ణయానికి వచ్చారు. అయితే ‘గేమ్ ఛేంజర్’ తర్వాత బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసి రిలీజ్ చేస్తామని శంకర్ తెలియచేశాడు. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ కూడా రిలీజ్ అయి ప్లాప్ కావటంతో ‘ఇండియన్3’పై నీలినీడలు కమ్ముకున్నాయి. శంకర్ మ్యాజిక్ పని చేయటం లేదని ‘ఇండియన్ 3’ ఓటీటీలోనే వస్తుందనే వారు కూడా లేకపోలేదు. అయితే శంకర్ మాత్రం ఈ సినిమా థియేటర్లలోనే వస్తుందని నమ్మబలుకుతున్నాడు. షూటింగ్ దాదాపుగా పూర్తయిందని, ప్యాచ్ వర్క్ పూర్తి చేసి మేజర్ గా ఉన్న విఎఫ్ ఎక్స్ వర్క్ ను పూర్తి చేస్తామని, అందుకు 6 నెలలు టైమ్ పడుతుందంటున్నాడు. అయితే శంకర్ ను నమ్మి ఇంకా విఎఫ్ ఎక్స్ వర్క్స్ కోసం కోట్లు కుమ్మరించే ధైర్యం నిర్మాతలు సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ చేస్తారా అన్నదే పెద్ద సందేహం. మరి ఈ విషయంలో లైకా ప్రొడక్షన్స్ నుంచి అధికారిక సమాచారం వస్తే తప్ప నమ్మలేం. చూద్దాం ఏం జరుగుతుందో…