Saif Ali Khan: ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చి పరారైన నిందితుడిని 33 గంటల్లోనే ముంబై బాంద్రా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడిని శుక్రవారం ముంబై క్రైంబ్రాంచి పోలీసులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. దొంగతనం కోసమా? సైఫ్‌పై దాడి చేసేందుకేనా? ఎవరైనా సుపారీ ఇచ్చారా? మరే విషయం కోసమైనా వెళ్లాడా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయా విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Saif Ali Khan: ముంబైలోని సైఫ్ అలీఖాన్ నివాసంలో గురువారం తెల్లవారుజాము దుండగుడు కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తీవ్రగాయాలతో సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ సమయంలో నిందితుడు పారిపోగా, వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అదేరోజు అర్ధరాత్రి దాటాక 2.33 గంటల సమయంలో నిందితుడు మెట్లు దిగి వెళ్తున్నట్టు సీసీ టీవీ పుటేజీలో రికార్డయింది. బ్యాగ్ తగిలించుకొని, భుజంపై స్కార్ఫ్ వేసుకొని నిందితుడు కనిపించాడు.
Saif Ali Khan: నిందితుడి ఫోటోలను విడుదల చేసిన పోలీసులు, దుండగుడిని పట్టుకునేందుకు 20 ప్రత్యేక పోలీస్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. బాంద్రా రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ అనుమానితుడు తిరిగాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రాత్రి మొత్తం అనుమానితుడి కోసం గాలింపు చేపట్టారు. రైల్వేస్టేషన్ పరిసరాలు, ఇతర ప్రాంతాల్లో గాలించారు. ఎట్టకేలకు శుక్రవారం ఉదయం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం అతన్ని బాంద్రా పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన దృశ్యాలు బయటకు వచ్చాయి.
Saif Ali Khan: అయితే సైఫ్ అలీఖాన్‌పై దాడిచేసిన నిందితుడిని అరెస్టు చేసినట్టు ఇంత వరకూ ప్రకటించకపోయినా, సైఫ్ ఇంటిలోని సీసీటీవీలో కనిపించిన దుండగుడు, పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన అనుమానితుడు ఒకేలా ఉండటంతో సైఫ్‌పై దాడికి పాల్పడింది అతడేనని తేలిపోయింది. దీంతో ముంబై నగరం ఊపిరి పీల్చుకున్నది. వరుస దాడులతో నగరం బెంబేలెత్తిపోతున్నది.