Priyanka Chopra: ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సినిమాలు, వెబ్ సీరిస్ లలో నటించి తనకంటూ ఓ గుర్తింపు ను తెచ్చుకుంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రియాంక చోప్రా చిలుకూరులోని బాలాజీ దేవాలయానికి వెళ్ళడం, అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. బాలాజీ టెంపుల్ పూజారి సుందరరాజన్ ఆమెకు స్వామివారి శేష వస్త్రాన్ని అందించారు. ప్రియాంక చోప్రాలో ఇంతటి భక్తి భావం ఉందని తాము ఊహించలేదని అభిమానులు అంటున్నారు. మహేశ్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన చర్చల కోసమే ఆమె హైదరాబాద్ వచ్చిందని తెలుస్తోంది.
Priyanka Chopra: ఈ సినిమాకు ఇప్పటికే ఆమె అగ్రిమెంట్ చేసిందని, గతంలో ఏర్పడిన అవాంతరాలు ఇప్పుడు ఏర్పడకుండా చూడమని ఆమె వెంకటేశ్వర స్వామిని కోరుకుందని సన్నిహితులు చెబుతున్నారు. ప్రియాంక తన కెరీర్ ప్రారంభంలోనే తెలుగులో ‘అపురూపం’ అనే మూవీలో హీరోయిన్ గా నటించింది. తొలికాపీ సైతం సిద్థమైన ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. అలానే రామ్ చరణ్ నటించిన తొలి హిందీ సినిమా ‘జంజీర్’లో ప్రియాంక హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని హిందీ, తెలుగు భాషల్లో నిర్మించారు. తెలుగులో అది ‘తుఫాన్’ పేరుతో విడుదలైంది కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. తెలుగు సినిమా రంగంలో ఎదురైన చేదు అనుభవాలు రిపీట్ కాకూడదనే ప్రియాంక బహుశా దేవుడిని కోరి ఉంటుందని అంటున్నారు.
View this post on Instagram