AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఓ జువైనల్ హోంలోని బాలికలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిర్వాహకులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ బాలికలు ఆరోపించారు. దీనిపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత విచారణకు ఆదేశించారు. ఈ విషయం తెలిసిన బాలికల కుటుంబ సభ్యులు కొందరు అక్కడికి చేరుకున్నారు.
AP News: విశాఖపట్నంలోని విశాఖ వ్యాలీ సమీపంలోని జువైనల్ హోమ్స్‌లో తమకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇస్తూ మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ బాలికలు ఆరోపణలు చేశారు. తమను వెంటనే బయటకు తీసుకెళ్లాలని కోరుతూ కేకలు వేశారు. తమను ఇళ్లకు పంపడం లేదని ఆ భవనం గోడపైకి ఎక్కి పెంకులు విసురుతూ దుర్భాషలాడుతూ కొందరు బాలికలు రచ్చ చేశారు.
AP News: ఈ సమయంలోనే ఇద్దరు బాలికలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమను వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బాలికల ఫిర్యాదు మేరకు ఆ హోంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణ చేపట్టింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర హోంమంత్రి అనిత ఆదేశించారు.